రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాములు కలకలం సృష్టించాయి. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సర్పంచి బూరుగుల నందయ్య ఇంట్లో 15 పాము పిల్లలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సర్పంచి ఇంట్లో పాముల కలకలం - సిరిసిల్ల జిల్లాలో పాముల కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాల్లో పాములు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సర్పంచి ఇంట్లో 15 పాము పిల్లలు లభ్యమయ్యాయి. ఆందోళన చెందిన గ్రామస్థులు వాటిని కర్రలతో కొట్టిచంపారు.
సిరిసిల్ల జిల్లాలో పాముల కలకలం
సర్పంచి నందయ్య ఇంట్లోని తులసి కోట నుంచి ఒక్కొక్కటిగా 15 పాము పిల్లలు బయటికి వచ్చాయి. ఆందోళన చెందిన గ్రామస్థులు వెంటనే వాటిని కర్రలతో కొట్టి చంపారు. గ్రామంలో చిత్తడి పెరగటంతో పాముల సంచారం ఎక్కువైందని స్థానికులు తెలిపారు. చనిపోయిన పాము పిల్లలు ఏ జాతికి చెందినవో అర్థమవ్వక సంశయంలో పడ్డారు.