తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతారామ కల్యాణానికి సిద్ధమైన రాజన్న ఆలయం

తెలంగాణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6 నుంచి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి.

సీతారాములు

By

Published : Apr 12, 2019, 4:40 PM IST

వేములవాడ రాజన్న ఆలయం సీతారామస్వామి కల్యాణానికి సిద్ధమైంది. గుడిలో క్షేత్రపాలకుడిగా ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సీతారామచంద్రుల వివాహం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయని ఆలయ ఈవో రాజేశ్వర్ తెలిపారు. శనివారం జరిగే కల్యాణానికి భక్తులు తరలి రావాలన్నారు. భక్తులకు చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

సీతారామ కల్యాణానికి సిద్ధమైన రాజన్న ఆలయం
ఇవీ చూడండి: పది స్థానాల్లో విజయం తథ్యం: కాంగ్రెస్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details