తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి.. - తెలంగాణ తాజా వార్తలు

సర్కారు బడి అంటే.. విరిగిన కుర్చీలు.. పగిలిన గోడలు... పెచ్చులూడుతున్న స్లాబులు.. తిరగని ఫ్యానులు.. వెలగని బల్బులు.. తలుపులు లేని తరగతులు.. తాగు నీటి కోసం ఇక్కట్లు.. శౌచాలయాలు లేక ఇబ్బందులు.. అభివృద్ధికి నోచుకోని భవంతులు. ఇదే మీ అభిప్రాయం అయితే ఈ పాఠశాలను చూసిన తర్వాత కచ్చితంగా మీ ఆలోచన మారుతుంది. సీఎస్​ఆర్​ నిధుల కింద ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో సిరిసిల్ల పట్టణంలో రూపుదిద్దుకున్న జిల్లా పరిషత్​ బాలికల ఉన్నత పాఠశాల కార్పొరేట్​ పాఠశాలలకు దీటుగా ఆకట్టుకుంటోంది.

ఇలా ఉంటే బడి.. మానాలనిపించదు మరి..
ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి..

By

Published : Feb 1, 2021, 11:19 AM IST

ఒకప్పుడు శిథిలమైన తరగతి గదులు నేడు ఆధునిక హంగులతో ఆకర్షిస్తున్నాయి. వసతులలేమితో సతమతమైన పాఠశాల నేడు అత్యాధునిక వసతులతో ఆహ్వానం పలుకుతోంది. కార్పొరేట్​ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక హంగులతో సాదరంగా స్వాగతం పలుకుతోంది సిరిసిల్లలోని జిల్లా పరిషత్​ బాలికోన్నత పాఠశాల.

మంత్రి కేటీఆర్ చొరవతో అత్యాధునిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎస్​ఆర్​ నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు రూ. మూడు కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. సుమారు 1,000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా... 20 తరగతి గదులు, గ్రంథాలయం, 32 కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు.

400 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని భోజనం చేసే విధంగా భోజనశాల, బాలికలకు నిరంతరం రక్షణ కల్పించేలా 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సింథటిక్​తో రూపొందించిన క్రీడామైదానం పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు మంత్రి కేటీఆర్ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నీ ఈ విధంగానే మారాలన్నది తన స్వప్నమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎత్తు ఏడడుగులు.. తనువెల్లా విరబూసిన పూలు

ABOUT THE AUTHOR

...view details