వస్త్ర పరిశ్రమలోని కార్మికుల ఉపాధి భద్రత కోసం ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని రూపొందించింది. దీనికి రూ.220 కోట్లు కేటాయించి, 2017 అక్టోబరు 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. అయిదు వేల మంది కార్మికులను యజమానులుగా మార్చాలనే లక్ష్యంతో సిరిసిల్లలోని పెద్దూరులో 88.03 ఎకరాలను వీవింగ్ పార్కుకు కేటాయించారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో షెడ్ల నిర్మాణం, మౌలిక వసతుల పనులు తుది దశలో ఉన్నాయి. ఇటీవల మరమగ్గాల తయారీ కంపెనీ యంత్రాలను తీసుకొచ్చింది. ఎంపికైన కార్మికులకు శిక్షణ త్వరలోనే ప్రారంభం కానుంది.జిల్లాలోని టెక్స్‌టైల్ పార్కుతోపాటు పట్టణంలోని పురాతన, సెమీ ఆటోమేటిక్ మరమగ్గాలపై వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఓవర్ పిక్ పద్ధతిలో నడిచే ఈ మగ్గాలపై వస్త్రోత్పత్తిలో వేగం, నాణ్యత లేక జాతీయ విపణిలో డిమాండ్ ఉండటం లేదు. ప్రస్తుతం తీసుకొచ్చిన మరమగ్గాలు 4/1 సెమీ ఆటోమేటిక్‌వి. వీటిపై అండ్‌పిక్ పద్ధతిలో ఉత్పత్తి జరుగుతుంది. ఒకేసారి నాలుగు రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల వాటికి నాణ్యత, నవ్యత మెరుగై, మంచి డిమాండ్ లభిస్తుంది.
కార్మికుల ఎంపిక