తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారి వైద్యానికి.. సాయం చేసిన సిరిసిల్ల ఎస్పీ - సిరిసిల్ల జిల్లా వార్తలు

ఖాకీ చొక్కాల మాటున కూడా మానవత్వం ఉంటుందని నిరూపించారు సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే ఆరోగ్యం బాగలేని ఎనిమిది నెలల చిన్నారికి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఎస్పీ ఆర్థిక సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Siricilla Sp Helps To Child Medical Treatment
చిన్నారి వైద్యానికి.. రూ.50 వేలు సాయం చేసిన సిరిసిల్ల ఎస్పీ

By

Published : Aug 19, 2020, 7:05 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలం కొండాపూర్​ గ్రామానికి చెందిన తాటిపల్లి భానుచందర్​, దివ్య దంపతులకు పాప పుట్టింది. ఎనిమిది నెలల ఆ పాపకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యం బాగలేదు. ప్రస్తుతం కరీంనగర్​లోని ఆదిత్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. చిన్నారికి వైద్యం చేయించడానికి ఆర్థిక స్థోమత లేక ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. పాప వైద్య ఖర్చుల కోసం సిరిసిల్ల రెడ్​ డ్రాప్​ సంస్థ తరపున రూ. 50 వేలు ఇప్పించారు. సమయానికి సాయం చేసిన ఎస్పీకి పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సర్వర్​ కూడా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details