తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాల ఆకలి తీర్చిన ఎస్పీ దంపతులు - మూగజీవాల ఆకలి తీర్చి..

లాక్‌డౌన్‌ వల్ల ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోవటం వల్ల మూగజీవాలకు ఆహారం దొరక్క అల్లాడిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్దే దంపతులు పెద్దమ్మ స్టేజీ వద్ద గల అటవీ ప్రాంతంలో కోతులకు ఆహారం అందించారు.

Siricilla SP Rahul Hedhe Distributes food for Monkeys
మూగజీవాల ఆకలి తీర్చి..

By

Published : May 17, 2020, 6:48 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్దే దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వద్ద గల అటవీ ప్రాంతంలో ఉన్న కోతులకు ఆహారం, పండ్లను అందజేశారు.

ఓ వైపు లాక్​డౌన్‌, మరోవైపు వేసవి కాలం కావటం వల్ల కోతులకు ఆహారం దొరకక బక్క చిక్కి పోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ కారణంగానే మూగజీవాలకు ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details