రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో రైతు బంధు, రైతు రుణ మాఫీ నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి.. రైతును రాజు చేయటమే కేసీఆర్ లక్ష్యమని రైతుసమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య తెలిపారు.
'వ్యవసాయాన్ని పండుగలా చేయటమే సీఎం కేసీఆర్ లక్ష్యం'
రైతుబంధు, రుణమాఫీ నిధులు విడుదల చేయటాన్న సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు రైతులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
siricilla mandal pedduru farmers welcomed cm kcr decision
మూడు పంటలకు సాగునీటితో పాటు ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి, పంట సాయంగా రైతుబంధు ఇస్తున్నారని నర్సయ్య వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు మంత్రి కేటీఆర్ శ్రమిస్తున్నారని కొనియాడారు.