ఆలోచనలకు కృషిని మేళవిస్తూ.. సరికొత్త కళాకృతులతో అబ్బురపరుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ తన మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారుచేసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి సమర్పించారు. గతంలో కూడా నేత కార్మికుడు నల్ల విజయ్ ఉంగరంలో నుంచి ఈదే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను, వివిధ రకాల కళాకృతులను తన మగ్గంపై నేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
సిరిసిల్ల నేతన్న అద్భుతం.. రాజన్నకు అగ్గిపెట్టెలో పట్టే చీర బహుకరణ - తెలంగాణ వార్తలు
సిరిసిల్ల చేనేత కార్మికుడు విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి వేములవాడ రాజన్నకు సమర్పించారు. ప్రత్యేక పూజను నిర్వహించి రాజేశుడికి చిరు కానుకను బహూకరించాడు. గతంలోనూ విజయ్ ఉంగరంలో నుంచి ఈదే చీరను, వివిధ కళాకృతులను తన మగ్గంపై నేసి ఔరా అనిపించారు.

సిరిసిల్ల నేతన్న అద్భుతం.. రాజన్నకు అగ్గిపెట్టెలో పట్టే చీర బహుకరణ
సిరిసిల్ల నేతన్న అద్భుతం.. రాజన్నకు అగ్గిపెట్టెలో పట్టే చీర బహుకరణ
అగ్గిపెట్టెలో ఇమిడే చీరను స్వామివారికి బహూకరించడంతో ఆలయ అర్చకులు విజయ్ దంపతులకు స్వామివారి ప్రసాదాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Kishan Reddy visits Ramappa temple: రామప్పలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. పూర్ణకుంభంతో స్వాగతం