జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. వానాకాలం పంట సాగుకు సంబంధించి నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచామని కలెక్టర్ తెలిపారు.
నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలను సహించేది లేదు: కలెక్టర్ - duplicate seeds selling in siricilla
సిరిసిల్ల కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో పాలనాధికారి కృష్ణభాస్కర్ సమీక్ష నిర్వహించారు. వానాకాలం పంట సాగుకు సంబంధించి నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అక్రమ అమ్మకందారులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
'నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలపై ఉక్కుపాదం'
నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసినప్పుడు రైతులు కచ్చితంగా రశీదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు మండల స్థాయిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్, వ్యవసాయ అధికారి నేతృత్వంలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.