రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా లాక్ డౌన్ అమలు తీరును ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు, వేములవాడలో కూడా డ్రోన్ కెమెరాలను వినియోగించి లాక్ డౌన్‌ను మరింత కఠినంగా ఆమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్లలో మార్కెట్ ఏరియా, రైతు బజార్, బైపాస్ రోడ్, కొత్త, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించినట్లు పేర్కొన్నారు.
'సిరిసిల్లలో డ్రోన్ కెమెరాలతో లాక్ డౌన్ పర్యవేక్షణ' - తెలంగాణ వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ అమలు తీరును ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని పలు ప్రాంతాలను పర్యవేక్షించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని ఆయన కోరారు.
police
అనవసరంగా, కారణం లేకుండా బయటికి వచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. బైకులు, వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.