తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్

Sircilla Textile Industry Crisis 2024 : తెలంగాణలో వస్త్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌ సిరిసిల్ల. అలాంటిది సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమను నిరవధికంగా బంద్ చేయాలని అనేక వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వస్త్ర పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడనున్నారు. దీనిపై తాజాగా బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా ఆయన కోరారు.

Sircilla Textile Industry Crisis 2024
Sircilla Textile Industry Crisis

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 11:55 AM IST

Sircilla Textile Industry Crisis 2024 : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను నిరవధికంగా మూసివేయాలని అనేక వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యాజమానులు చెబుతున్నారు.

Sircilla Polyester Textile Industry :గతంలో ఉత్పత్తి చేసిన ప్రభుత్వ ఆర్డర్ల తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని యజామానులు వాపోతున్నారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ వారు తీసుకున్న నిర్ణయం వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు తెలిపారు.

KTR Tweet on Sircilla Powerloom Crisis :వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభంపైన ఆయన స్పందించారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించారు.

డెక్కన్ హాట్ ఎగ్జిబిషన్​లో ఆకట్టుకున్న చేనేత, హస్త కళాకృతులు

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని, పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ​ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.

Minister Tummala React on Sircilla Textile Industry Crisis :మరోవైపురాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమను నిరవధికంగా మూసివేయాలన్న యాజమాన్యం నిర్ణయంపై సోమవారం రోజున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పరిశ్రమ మూసివేతకు కారణాలు తెలుసుకొని, ప్రభుత్వం తరఫున సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు అండగా ఉండాలని అధికారులకు చెప్పారు. పరిశ్రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, రాష్ట్ర చేనేత శాఖ కమిషనర్‌ని మంత్రి తుమ్మల ఆదేశించారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలు పరిశ్రమ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు చెందిన బకాయిలను, రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. యజమానులు పెట్టుబడులు పెట్టి వస్త్రాలను ఉత్పత్తి చేయలేమని తేల్చిచెబుతున్నారు. టెక్స్‌టైల్ పార్కు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కేవలం 600లోపు మగ్గాలున్న టెక్స్‌టైల్ పార్కు, 25 వేల మగ్గాలకు మించి ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని చెప్పడాన్ని పాలిస్టర్‌ పరిశ్రమ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ విధానంతో వందలాది పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వస్త్రపరిశ్రమ సమస్యలపై నివేదిక ఇవ్వండి : తుమ్మల

National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు

ABOUT THE AUTHOR

...view details