తెలంగాణ

telangana

ETV Bharat / state

Sri Venkateswara swamy temple: సిరిసిల్ల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు.. భక్తుల బారులు - తెలంగాణ వార్తలు

సిరిసిల్ల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సాయంత్రం రథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది.

Sri Venkateswara swamy temple, rathotsavam
సిరిసిల్ల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు, వేంకటేశ్వరస్వామి రథోత్సవం 2021

By

Published : Oct 20, 2021, 10:23 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(Sri Venkateswara swamy temple) ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వేకువజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తూ... మొక్కులు చెల్లించుకుంటున్నారు

పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో అత్యంత ఎత్తైన రథంపై శ్రీలక్ష్మి వేంటేశ్వరస్వామి దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రథంపై భక్తులకు స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం రథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండి:Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details