అప్పుడు అగ్గిపెట్ట.. ఇప్పుడు దబ్బనం.. సిరిసిల్ల నేతన్న పనితనం Sircilla Handloom Weaver Designs : చేనేతల కళా ప్రతిభకు నిదర్శం.. అగ్గిపెట్టెలో పట్టే చీర. చాలామంది ఇలాంటి చీర గురించి విని ఉంటారు. చూసింది మాత్రం తక్కువే. పైగా.. ఆ చీరను కట్టుకునేందుకు వీలవదు. కానీ.. సిరిసిల్లకు చెందిన ఈ కుర్రాడు రూపొందించిన అగ్గిపెట్టెలో పట్టే చీరను ఎంచక్కా కట్టుకోవచ్చు. అందుకే.. అరుదైన, అందమైన ఈ చీర ధరించాలని చాలా మంది పోటీపడుతున్నారు.
బంగారు జరీ చీర..
Sircilla Handloom Weavers : చూడగానే ఆకట్టుకునే ఈ చీరను.. బంగారం జరీ పోగులతో తయారు చేశాడు చేనేత కళాకా రుడు వెల్ది హరిప్రసాద్. న్యూజిలాండ్‌కు చెందిన ఓ దంపతుల కోరిక మేరకు దీనికి రూపకల్పన చేశాడు. పొడవు.. 5.5 మీటర్లు.. బరువు 180 గ్రాములు. దీని తయారీకి.. 10 వేలు ఖర్చైనట్లు చెబుతున్నాడు.
దబ్బనంలో దూరే చీర..
Sircilla Handloom Sarees : ఇదేకాదు.. దబ్బనంలో దూరిపోయే మరో చీరనూ తయారు చేసి ఔరా అనిపించాడు.. హరి ప్రసాద్. చాలా పలుచగా ఉండే దీనిని సులువుగా కట్టుకోవచ్చు. బరువు 350 గ్రాములే. ఇన్ని విభిన్న చీరలు రూపొందించిన హరిప్రసాద్ చదివించి..కేవలం 10వ తరగతే. ప్రయోగాలపై ఇష్టంతోనే ఇలాంటి చీరలు తయారు చేస్తున్నాడు.
ఆకట్టుకునే డిజైన్లలో..
Sircilla Weaver Designs : సిరిసిల్ల అంటే పాలిస్టర్, కాటన్ వస్త్రాలు మాత్రమే ఉత్పత్తి చేస్తారనే అభిప్రాయం ఉంది. ఈ వాదనల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు..హరిప్రసాద్. చేనేతే కాక.. మరమగ్గం వాడకంలోను ముందున్నాడు. బెంగుళూరులో జకార్ట్ యంత్ర వినియోగంపై శిక్షణ పొంది.. సిరిసిల్లలోనే ఆధునిక పద్ధతిలో వస్త్ర ఉత్పత్తి చేస్తున్నాడు. ఆకట్టుకునే డిజైన్లు రూపొందిస్తున్నాడు.
వస్త్రాలపై బొమ్మలు..
Sircilla Weaver Veldi Hari Prasad : ఈ యంత్రం సాయంతో వస్త్రాలపైనే దేవుళ్లు, రాజకీయ నేతల బొమ్మలను రూపొందిస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నాడు హరిప్రసాద్. ఇక్కడ ఇలాంటి యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో.. వినియోగదారులు తమ చిత్రాలతో వస్త్రాలు తయారు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నా రు. తన పనితనం.. విదేశాల్లో ఉన్న వాళ్లనూ ఆకర్షిస్తోంది. వాళ్లే చాలా సందర్భాల్లో హరికి చేదోడుగా నిలుస్తున్నారు.
ప్రయోగాలతో లాభాలు..
Sircilla Handloom Weavers : సాధారణంగా అయితే 7-8 మరమగ్గాలు నడిపితేనే.. ఒకరికి రోజుకు 7 వందల నుంచి 8 వందల కూలీ గిట్టుబాటు అవుతుంది. కానీ.. తన వద్దనున్న ఒక్క ఎలక్ట్రానిక్ జకార్ట్ యంత్రంతో 8 వందలు సంపాదించవచ్చని చెబుతున్నాడు హరిప్రసాద్. చేనేతలు నష్టాల నుంచి బయట పడాలంటే ఇలాంటి ప్రయోగాలు తప్పవంటున్నాడు.
దబ్బనంలో దూరే చీర, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.. హరి ప్రసాద్. దాంతో.. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చేనేత కళకు గుర్తింపు తెచ్చేలా.. విభిన్న ప్రయోగాలు చేస్తున్న ఈ యువకుడు..సహాయ సహకారాలు అందిస్తే.. ఇంకా మరిన్ని ప్రయోగాలు చేస్తానని చెబుతున్నాడు.