Sircilla Handloom Indian Flags :స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు (Azadi Ka Amrit Mahotsav) అవుతున్న సందర్భంగా దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా. మహానీయుల త్యాగాలు.. పోరాట ఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండాలు ఎగుర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నాటికి ఇంటింటికీ జాతీయ జెండాలను (Har Ghar Tiranga) అందించేందుకు సిరిసిల్లలో జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. 55లక్షల మీటర్ల పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి జెండాల తయారీకి అప్పగించారు. ఆ బట్టను ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారు చేయాలని సూచించారు.
"స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాకు దేశ వ్యాప్తంగా ఆర్టర్లు వచ్చాయి. గత 15 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్డర్లు పూర్తి చేశాము. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. ఇక్కడ దాదాపు 5 వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా సిరిసిల్లా చేనేతలకు పేరు రావడం ఆనందంగా ఉంది." - మురళి, ఆసామి, రాజన్నసిరిసిల్ల జిల్లా
Sircilla Weavers Indian Flags : సిరిసిల్ల నేతన్నల వద్దనే 55 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. ఈ వస్త్రానికి ఒక్కో మీటరుకు రూ.12 చెల్లిస్తున్నారు. అంటే రూ.6.60 కోట్ల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి.స్వాతంత్య్ర సంబురాలు సిరిసిల్ల నేతన్నలకు (77th Independence Day Telangana)కలిసి వచ్చాయి. ఈ జెండాల తయారీలో తలమునకలైన మహిళలు తమకు ఇలాంటి పనులు ఏడాదంతా ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు. తాము బీడీలు తయారు చేస్తే కూలి తక్కువగా అందుతుందని అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి పనులు కల్పిస్తే వేన్నీళ్లకు చన్నీల్లు తోడన్నట్లు మేము కూడా కష్టపడటానికి సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు.
జెండాకు సెల్యూట్ చేస్తూ మాజీ జవాన్ మృతి
"మేము ఇది వరకు బీడీలు చేసేవాళ్లం. రోజుకు రూ.200 వందలు వచ్చేవి. ఇప్పుడు జెండాలు తయారు చేస్తే రోజు రూ. 300 నుంచి రూ.500 వరకు వస్తున్నాయి. ఈ జెండాల పని అయిపోతే ఇక మళ్లీ మాకేం పని ఉండదు. మళ్లీ బీడీలు చేసుకోవడమే ఇగ. ఆ బీడీలతో వచ్చే సంపాదనలో మాకు కనీస అవసరాలు తీరడం లేదు. పిల్లల ఫీజులు ఇలాంటివి కూడా కట్టుకోలేకపోతున్నాం. చేనేత రంగంలోనే మాకు ప్రభుత్వం.. శాశ్వతంగా మాకు ఏదైనా పని కల్పిస్తే బాగుంటుంది."- తయారీదారులు