తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో ఎగిరిన మువ్వన్నెల జెండా - republic day celebrations news

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్​ కళాశాల మైదానంలో కలెక్టర్​ కృష్ణభాస్కర్​ జెండా ఎగరేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సందేశమిచ్చారు.

sircilla collector krishna bhaskar hosted flag
sircilla collector krishna bhaskar hosted flag

By

Published : Jan 26, 2021, 10:37 AM IST

72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి కలెక్టర్​ సందేశాన్నిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ నేలకొండ అరుణ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అమర జవాన్లకు మోదీ నివాళులు

ABOUT THE AUTHOR

...view details