తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజన్న ఆలయంలో శరవేగంగా శివరాత్రి జాతర ఏర్పాట్లు - వేములవాడలో శివరాత్రి ఏర్పాట్లు

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో మహశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Shivaratri Jatara arrangements
వేములవాడ రాజన్న ఆలయంలో శరవేగంగా శివరాత్రి జాతర ఏర్పాట్లు

By

Published : Feb 19, 2020, 6:27 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కాబోయే జాతర కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వచ్చే భక్తులకు సదుపాయాల కల్పన కోసం ఈ సారి జాతర బడ్జెట్‌‌ను 2కోట్ల 56 లక్షల రూపాయలకు పెంచారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడపనుంది. హైదరాబాద్ నుంచి వేములవాడకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

వేములవాడ రాజన్న ఆలయంలో శరవేగంగా శివరాత్రి జాతర ఏర్పాట్లు

ఇదీ చూడండి: సేవే లక్ష్యంగా.. సైకిల్​ సవారీ

ABOUT THE AUTHOR

...view details