రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. సుమారు 200మంది భక్తులు మండల శివ దీక్ష మాలధారణ వేసుకున్నారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభం - Rajanna sirisilla District Latest News
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. 200మంది భక్తులు మండల శివ దీక్ష మాలధారణ వేసుకున్నారు. వచ్చే నెల 16న అర్థ మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి.
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభం
నేటి నుంచి మహా శివరాత్రి వరకు శివ దీక్షలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. వచ్చే నెల 16న అర్థ మండల దీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. శివరాత్రి రోజున భక్తులు దీక్ష విరమణ చేయనున్నట్లు పేర్కొన్నారు.