షీటీమ్స్ నిరంతరం డేగ కళ్లతో మహిళల రక్షణ కోసం పని చేస్తున్నాయని.. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా షీటీమ్ ఇంఛార్జ్ మహేశ్ గౌడ్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా షీటీమ్ బృందం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్ పనిచేసే విధానం, మహిళలకు షీటీమ్ ద్వారా కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.
డేగ కళ్లతో.. నిరంతరం మహిళల రక్షణ కోసమే.. - sircilla latest awareness programs news
సిరిసిల్ల పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద షీటీమ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిరంతరం మహిళల రక్షణ కోసమే పనిచేస్తున్న షీటీమ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. ఆపదలో ఉన్నపుడు ఆలస్యం చేయొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా షీటీమ్ ఇంఛార్జ్ మహేశ్ గౌడ్ సూచించారు.
డేగ కళ్లతో.. నిరంతరం మహిళల రక్షణ కోసమే..
మహిళల మీద జరుగుతున్న దాడులను వివరించి.. వాటినుంచి ఎలా కాపాడుకోవాలనే అవగాహనను మహేశ్ గౌడ్ కల్పించారు. ఆపదలో ఉన్నపుడు ఆలస్యం చేయకుండా 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల షీ-టీమ్ నెంబర్ 7901132141 ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.