తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు - రాజన్న ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఘనంగా శ్రీ జగద్గురు శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

SHANKARA JAYANTHI UTHSAVAALU IN VEMULAVADA
రాజన్న ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు

By

Published : Apr 24, 2020, 1:16 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఘనంగా శ్రీ జగద్గురు శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ శంకరాచార్యుల చిత్రపటంతో అర్చకులు ప్రదక్షణాలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి వార్ల చిత్రపటాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. కల్యాణ మండపంలో శంకర విజయ పారాయణం నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. లాక్​డౌన్ కొనసాగుతున్నందున ఆలయాన్ని మూసివేసి గర్భాలయంలో నిత్యపూజలు కొనసాగిస్తున్నారు. భక్తులెవరినీ అనుమతించడం లేదు.

ఇవీ చూడండి:సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details