ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తొలిరోజు స్వామి వారి కల్యాణ మండపంలో ఆలయ ఆస్థానాచార్యులు భీమ శంకర శర్మ అర్చకులకు వర్ని అందజేశారు. అనంతరం జగద్గురు శంకరాచార్యుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో ప్రతి రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
రాజన్న ఆలయంలో శంకర జయంతోత్సవాలు - rajanna temple
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జగద్గురు శంకరాచార్యుల చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేశారు.
రాజన్న ఆలయంలో శంకర జయంతోత్సవాలు