Self Lock Down: రాజన్నసిరిసిల్ల జిల్లా గూడెంలో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకున్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు తిరిగి వచ్చిన ఓ వ్యక్తికి ఓమిక్రాన్ నిర్ధారణ కావడంతో పాటు కుటుంబ సభ్యులిద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ మరింత విజృంభించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నట్లు తెలిపారు.
Self Lock Down: ఒమిక్రాన్ భయం.. గ్రామస్థుల సెల్ఫ్ లాక్‌డౌన్
Self Lock Down: ఒమిక్రాన్ వేరియంట్ ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు బయటపడడంతో ప్రజల్లో భయం మొదలైంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గూడెంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో వైరస్ మరింత విజృంభించకుండా ఉండేందుకు గ్రామస్థులే సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు.
Omicron lock down: కేవలం ఉదయం మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామంలో పది రోజుల వరకు లాక్‌డౌన్ పాటించనున్నారు. గ్రామంలోని ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. విధిగా మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో ఒక ఫంక్షన్‌లో పాల్గొనగా.. అక్కడ 53 మంది నమూనాలను సేకరించి అందరిని హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.