పాఠశాల బస్సు డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారులతో కలిసి పాఠశాల వాహనాలను తనిఖీ చేశారు. బస్సులో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి వసతులు, డ్రైవర్ వ్యవహార శైలిపై చర్చించుకోవాలని సూచించారు. ప్రతి నెల డ్రైవర్లలందరికీ కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు చేయిస్తామని వెల్లడించారు.
పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులను ఎస్పీ రాహుల్ హెగ్డే తనిఖీ చేశారు. బస్సులోని సదుపాయాలు, ఫిట్నెస్పై ఆరాతీశారు.
పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ఎస్పీ