రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆటపాటలతో స్వామి వారికి వీడ్కోలు పలికారు. స్థానిక గుడి చెరువులో వినాయకుల నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన విగ్రహాలతో గుడి చెరువు ప్రాంగణమంతా సందడిగా మారింది.
వేములవాడలో భక్తిశ్రద్ధలతో గణేశ్ నిమజ్జనం - రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో గణనాథునికి వీడ్కోలు