ప్లాస్టిక్ నిషేధంపై వేములవాడలో అవగాహన ర్యాలీ - ప్లాస్టిక్ నిషేధంపై వేములవాడలో అవగాహన ర్యాలీ
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త పాలనాధికారి యాస్మిన్ బాషా సూచించారు.
ప్లాస్టిక్ నిషేధంపై వేములవాడలో అవగాహన ర్యాలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘం కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ జరిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధించాలని... ప్లాస్టిక్ వ్యర్ధపదార్థాలు భూమిలో కలిసేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని అది చాలా ప్రమాదకరం అని పేర్కొన్నారు. అందుకే ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయని వెల్లడించారు.