రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం కావడం వల్ల కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు - vemulawada temple
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం సందర్భంగా.. కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
రాజన్న సన్నిధి
సుమారు 30వేల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వారికి కావాల్సిన వసతులు కల్పించినట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
- ఇదీ చదవండి :అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం..