తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడిని తలపెట్టారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా కండక్టర్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్‌కు అస్వస్థత - rtc strike
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్లలోని ఎమ్మెల్యే భవనాన్ని కార్మికులు ముట్టడించారు.
![ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్‌కు అస్వస్థత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5028349-904-5028349-1573465434332.jpg)
ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్ అస్వస్థత
ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి... మహిళా కండక్టర్ అస్వస్థత
Last Updated : Nov 12, 2019, 7:30 PM IST