తెలంగాణ

telangana

ETV Bharat / state

డిపోల్లో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు

లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమైన ఆర్టీసీ కార్మికులు ఆదివారం రోజున విధులకు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ డిపోల్లో కార్మికులు, ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రతి రోజు 30 శాతం మంది విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.

rtc employees attending for duties in depots
డిపోల్లో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు

By

Published : May 11, 2020, 1:22 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల్లో కార్మికులు విధులకు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులు విధులకు రాకపోగా... సిరిసిల్ల డీఎం శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు వంతుల వారీగా హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించారు. డిపోలోని పలు విభాగాలతో పాటు బస్టాండ్‌లలో సిబ్బందికి విధులు అప్పగించారు.

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన తరువాత వేములవాడ ఆర్టీసీ డిపో పరిధిలోని కార్మికులు, ఉద్యోగులు ఇంటికే పరిమిమయ్యారు. ప్రతి రోజు 30 శాతం కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వేములవాడ డీఎం భూపతిరెడ్డి తెలిపారు. ఆదివారం దాదాపు 70 మంది హాజరైనట్లు డీఎం పేర్కొన్నారు.

ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details