తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి' - 'RTC dues should be released immediately' latest news of rajannasirisilla

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 10వ రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు అఖిలపక్ష నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్​ చేశారు.

'ఆర్టీసీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి'

By

Published : Oct 14, 2019, 9:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు, అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్​రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, కార్మిక సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఆర్టీసీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి పెన్​డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.

'ఆర్టీసీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details