తెలంగాణ

telangana

ETV Bharat / state

RTC Bus Wrecked: చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు - ఆర్టీసీ బస్సు

rtc-bus-washed-away-in-floods
rtc-bus-washed-away-in-floods

By

Published : Aug 31, 2021, 8:37 AM IST

Updated : Aug 31, 2021, 9:28 AM IST

08:36 August 31

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. పలుచోట్ల రహదారిపై నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద లోలెవల్‌ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం లోలెవల్​ వంతెనపై వరదలో చిక్కుకుపోయింది. వంతెన అంచు వరకు కొట్టుకుపోయింది. 

VIKARABAD MLA: వర్షంలో తడుస్తూ.. వాగులో నడస్తూ.. నవవధువు మృతదేహాన్ని మోసుకొచ్చిన ఎమ్మెల్యే!

ఘటన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల కేకలతో స్థానిక రైతులు బస్సును గుర్తించి.. అందరిని రక్షించారు. మంగళవారం ఉదయం వరద ఉద్ధృతికి బస్సు వాగులో కొట్టుకుపోయింది. రైతులు వారి ఆర్తనాదాలు వినకపోయి ఉంటే... పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగేది. అలుగులు పారుతున్నప్పుడు... ప్రయాణాలు చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. నీటి ఉద్ధృతిని అంచనా వేయకపోవడం వల్ల వాహనాలు కొట్టుకుపోయి... ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 

ఇదీ చూడండి:RAINS: రాష్ట్రంలో కుంభవృష్టి.. పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలం

Last Updated : Aug 31, 2021, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details