రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు వరద ఉద్ధృతిలో చిక్కుకుంది. గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య ఉన్న వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతి ఉన్నా లెక్క చేయని డ్రైవర్ బస్సును వంతెనపై తీసుకెళ్లారు. ప్రవాహ ఉద్ధృతికి బస్సు వంతెన చివరి అంచు వరకు వెళ్లి ఆగింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా భయంతో కేకలు వేశారు.
bus gets stuck in flood: వరదే కదా.. ఏం కాదులే అనుకున్నాడు..
ఆర్టీసీ బస్సు డ్రైవర్ అత్యుత్సాహం 12మంది ప్రయాణికులను వాగు మధ్యలో నిలబెట్టింది. వాగు ప్రవాహాన్ని లెక్కచేయకుండా వెళ్లడం వల్ల ఓ ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట- లింగన్నపేట గ్రామాల మధ్య జరిగింది.
bus
వారి కేకలు విన్న పరిసరాల్లోని వ్యవసాయం భూముల్లో ఉన్న లింగన్నపేట రైతులు అప్రమయ్యారు. ప్రయాణికులను కాపాడేందుకు వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న తాళ్లను తీసుకెళ్లారు. ఈత వచ్చిన రైతులు బస్సు వద్దకు వెళ్లి ప్రయాణికులను రక్షించారు. డ్రైవర్ అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. సకాలంలో స్థానికులు రాకుంటే తమ పరిస్థితి ఏంటని మండిపడ్డారు.
ఇదీ చూడండి:Two girls missing: వరద ఉద్ధృతికి వాగు ఇద్దరు యువతుల గల్లంతు