రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్య మానేరు ప్రాజెక్టును విశ్రాంత చీఫ్ ఇంజినీర్ల బృందం సందర్శించింది. మట్టికట్ట లీకేజీ మరమ్మత్తు పనులను పరిశీలించారు. మధ్యమానేరులో కలిసే బోగం ఒర్రె ప్రవాహ స్థలంలో లీకేజీ సమస్య ఏర్పడిందన్నారు. మట్టికట్ట అడుగు భాగపు నేలలో సున్నపురాయి అధికంగా ఉండటంతో ఆనకట్ట పటిష్ఠత సంక్లిష్టంగా మారిందన్నారు. ఇందుకోసం ఐదు వందల మీటర్ల మేరకు మట్టి కట్టకు శాశ్వత మరమ్మత్తు చేపట్టాలన్నారు. ఈ పర్యటనలో విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు అనంతరాములు, పొల్సాని వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.
మధ్యమానేరులో విశ్రాంత చీఫ్ ఇంజినీర్ల బృందం - మధ్యమానేరులో విశ్రాంత చీఫ్ ఇంజినీర్ల బృందం
రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టును విశ్రాంత చీఫ్ ఇంజినీర్ల బృందం సందర్శించింది.

మధ్యమానేరులో విశ్రాంత చీఫ్ ఇంజినీర్ల బృందం