మిడ్ మానేరు ముంపు గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం వద్ద నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేశామన్నారు. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా.. వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయినా... నిర్వాసితుల సమస్యలు మాత్రం పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు.
మిడ్మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల ధర్నా - mid maaneru news
మిడ్ మానేరు ముంపు గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేశామని.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
Residents of Mumpu villages hold a dharna at road
రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టటంతో వాహనాలు చాలా దూరం నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో మునిందర్, పోలీసులు... నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా.. వారు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:ముంబయి దాడుల సూత్రధారికి 15 ఏళ్ల జైలు