సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ(సెస్)కు పాలకవర్గం పదవీకాలం పొడిగించకుండా... ఎన్నికలు నిర్వహించాలని సెస్ ప్రాతినిధ్య సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని సహకార కమిషనర్ వీర బ్రహ్మయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. తక్షణమే ప్రత్యేక అధికారిని నియమించి... సంస్థలో జరుగుతోన్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని సభ్యుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
పదవీకాలం పొడిగించకుండా.. ఎన్నికలు నిర్వహించండి - telangana news
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ( సెస్ )కు పాలకవర్గం పదవీకాలం పొడిగించకుండా... ఎన్నికలు నిర్వహించాలని సెస్ ప్రాతినిధ్య సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాంపల్లిలోని సహకార కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని పేర్కొన్నారు.
పదవీకాలం పొడిగించకుండా.. ఎన్నికలు నిర్వహించండి
దీనిపై స్పందించిన కమిషనర్ వీరబ్రహ్మయ్య... మంత్రి కేటీఆర్ నుంచి లేఖ తీసుకువస్తే పాలకవర్గం రద్దు చేస్తామని తెలిపారు. దీంతో సెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఐపీఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం దారుణమని అన్నారు. తక్షణమే మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి:సరిహద్దులో బలగాల ఉపసంహరణ ఇలా..