ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కృష్ణభాస్కర్ దీనిని ప్రారంభించారు. అంతకు మునుపు ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ అంతర వ్యాక్సిన్ను ఆవిష్కరించారు. మానవాభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా జనాభా స్థిరీకరణకు కృషి చేయాలని ఆయన అన్నారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.
జనాభా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో ర్యాలీ - ప్రపంచ జనాభా దినోత్సవం
విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు స్థానికులు ర్యాలీ నిర్వహించారు.
జనాభా ర్యాలీ