తెలంగాణ

telangana

ETV Bharat / state

యాసంగి కోసం రాజరాజేశ్వర జలాశయం నీరు విడుదల - తెలంగాణ వార్తలు

యాసంగి సాగు కోసం రాజరాజేశ్వర జలాశయం నుంచి నీటిని ప్రాజెక్ట్ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఈ యాసంగికి 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దిగువ మానేరుకి 5 టీఎంసీల నీటిని బుధవారం విడుదల చేయనున్నారు.

rajarajeswara-project-water-released-on-tuesday-in-rajanna-sircilla-district
యాసంగి కోసం రాజరాజేశ్వర జలాశయం నీరు విడుదల

By

Published : Jan 12, 2021, 7:12 PM IST

రాజరాజేశ్వర జలాశయం నుంచి నీటిని ప్రాజెక్ట్ అధికారులు మంగళవారం విడుదల చేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు యాసంగి పంటలకు కోసం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి కాల్వ పరిధిలో 70 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జలాశయం నిర్మాణం పూర్తయిన రెండో ఏడాది పూర్తిస్థాయిలో 27.854 టీఎంసీల నీటిని నింపారు. తొలుత కుడి కాల్వ పరిధిలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరందించారు. ఈ యాసంగికి 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

దిగువ మానేరుకి 5 టీఎంసీల నీటిని బుధవారం విడుదల చేయనున్నారు. కుడి కాల్వ పరిధిలో క్రమంగా నీటి విడుదలను పెంచుతూ పూర్తి ఆయకట్టుకు నీటిని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, సైదాపూర్, చిగురుమామిడి, కోహెడ మండలాలకు సాగునీరు అందిస్తారు.

ఇదీ చదవండి:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details