తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయ బడ్జెట్​ రూ. 131.71 కోట్లు - వేముల వాడ ఆలయ వార్షిక బడ్జెట్​

వేములవాడ రాజన్న ఆలయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్​ ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. ఆలయ అభివృద్ధి, పారిశుద్ధ్యం, భక్తుల సౌకర్యాల కల్పనకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారు.

రాజన్న ఆలయ బడ్జెట్​

By

Published : Mar 30, 2019, 2:00 PM IST

రాజన్న ఆలయం బడ్జెట్​ ప్రతిపాదనలు వివరిస్తున్న ఈవో
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికివచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.137.71 కోట్లతో అధికారులు బడ్జెట్​ రూపొందించారు. గతంతో పోల్చితే ఈసారి రూ. 24 కోట్లు అదనంగా కేటాయించారు. ఆలయం అభివృద్ధి పనులు, ఉద్యోగుల వేతనాలకు రూ. 17.20 కోట్లు, పించన్లకు రూ. 6 కోట్లు ప్రతిపాదించారు.

కేటాయింపులు ఇలా..

మహాశివరాత్రి రోజు జరిగే శివ కల్యాణం, ఇతర సంప్రదాయ వేడుకల కోసం రూ.1.83 కోట్లు, ప్రసాదాల తయారీకి రూ. 12 కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం నిర్వహణకు రూ. 4.32 కోట్లు, ఆలయం భద్రతకు రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈవో దూస రాజేశ్వర్​ తెలిపారు.
రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు ఈసారి బడ్జెట్​లో పెద్దపీట వేశామని ఈవో తెలిపారు.

ఇదీ చదవండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!

ABOUT THE AUTHOR

...view details