ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీల లెక్కింపు చేపట్టారు. 16 రోజులకు గానూ రూ.94.71 లక్షల నగదు, 91 గ్రాముల బంగారం, 7.4 కిలోల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించుకున్నారు.
రాజన్న హుండీల లెక్కింపు.. ఆదాయం ఎంతో తెలుసా - vemulavada rajanna latest news
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీలు లెక్కించారు. 16 రోజులకు రూ.94.71 లక్షలకు పైగా నగదు వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు.
రాజన్న హుండీల లెక్కింపు.. ఆదాయం ఎంతో తెలుసా
కార్తిక మాసం పర్వదినాలు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. రాజన్న ఆలయ ఓవెన్లో హుండీ డబ్బుల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.కృష్ణ ప్రసాద్, ఏఈవో హరి కిషన్, ఉద్యోగులు, శివ శక్తి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.