నాణ్యత, తాలు, మట్టి పేరుతో కొనుగోలు కేంద్రాలు, రైసు మిల్లులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే హెచ్చరించారు. తూకంలో మోసాలకు పాల్పడవద్దని సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రైసు మిల్లుల యాజమాన్యం తీరుపై రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ఎస్పీ అన్నారు. ధాన్యం నాణ్యత లేకపోతే వ్యవసాయ అధికారులు పరిశీలించిన అనంతరం ధర నిర్ణయించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో సంబంధిత మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
'ఇక నుంచి కొనుగోలు కేంద్రాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు' - telangana news
తాలు, మట్టి పేరుతో వరి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే హెచ్చరించారు. నాణ్యత లాంటి సాకులతో తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. రైసు మిల్లులు, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయడానికి టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రైతులు మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తనిఖీలకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. తూకం, తేమ విషయంలో కొనుగోలు కేంద్రాలు మోసాలకు పాల్పడితే డయల్ 100 లేదా 6303922572, 7901124613 నంబర్లను సంప్రదిచాలని కోరారు. రైతులకు ఎల్లవేళలా పోలీసులు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్, డీఆర్డీవో కౌటిల్య రెడ్డి, డీఏఓ రణధీర్ రెడ్డి, పౌరసరఫరాల అధికారు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఆ విషయంలో దిల్లీ, ముంబయితో పోలిస్తే హైదరాబాద్ నయం'