తెలంగాణ

telangana

ETV Bharat / state

పారదర్శకంగా పోలీసుల సేవలుండాలి: ఎస్పీ రాహుల్‌ హెగ్డే - సిరిసిల్ల ఎస్పీ రాహుల్​ హెగ్డే తాజా వార్తలు

సమస్యల పరిష్కారంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. నిషేధిత పొగాకు అమ్మకాలను, ఇసుక రవాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికులు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

పారదర్శకంగా పోలీసుల సేవలుండాలి: ఎస్పీ రాహుల్‌ హెగ్డే
పారదర్శకంగా పోలీసుల సేవలుండాలి: ఎస్పీ రాహుల్‌ హెగ్డే

By

Published : Sep 19, 2020, 7:22 PM IST

సమస్యల పరిష్కారంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు. వేములవాడ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు.

సీసీటీఎన్ఎస్లో ఫైల్ అప్లోడ్ చేసే క్రమంలో క్రైమ్ సీన్, న్యూస్, ఫొటోలు తప్పకుండా అప్లోడ్ చేయాలన్నారు. పోలీస్ రాణా పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో బ్లూకోట్స్, బీట్ సిబ్బంది ప్రతి గ్రామాన్ని సందర్శించి.. నేరాలపై ప్రత్యేకనిఘా ఉంచాలన్నారు.

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. నిషేధిత పొగాకు అమ్మకాలను, ఇసుక రవాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికులు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటేష్, ఎస్సై పాల్గొన్నారు.

ఇదీ చదవండి:చిన్నారి వైద్యానికి.. సాయం చేసిన సిరిసిల్ల ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details