తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షేత్రస్థాయిలో వారి ఆరోగ్యంపై దృష్టి: ఎస్పీ రాహుల్ హెగ్డే - ఎస్పీ రాహుల్ హెగ్డే తాజా వార్తలు

కరోనా సోకిన పోలీస్​ అధికారులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామన్నారు.

Rajanna Sirisilla District, SP Rahul Hegde
Rajanna Sirisilla District, SP Rahul Hegde

By

Published : May 3, 2021, 7:44 PM IST

కొవిడ్​ రెండో దశలో వైరస్ మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారితో ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. దాని ద్వారా క్షేత్రస్థాయిలో వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చిన అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పండ్లు, కరోనా కిట్లను వైరస్ బారిన పడిన పోలీసులకు అందజేశామన్నారు. వారంలో రెండు రోజులు డాక్టర్ల సహాయంతో ఆన్​లైన్​ ద్వారా.. వారు తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు కొవిడ్​పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

విధి నిర్వహణలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో డీఎస్పీ రవికుమార్, డాక్టర్ నయంజహషేక్, ఆర్.ఐ. కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్​కు బలవుతున్న ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details