తెలంగాణ

telangana

ETV Bharat / state

సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి స్థలాన్ని సేకరించండి: కలెక్టర్​ - rajanna sirisilla district collector krishna bhaskar latest news

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సిరిసిల్ల జిల్లాలో 300 బెడ్స్ సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం స్థల సేకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

rajanna sirisilla district collector krishna bhaskar on super speciality hospital
సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి స్థల సేకరణ చేయండి: కలెక్టర్​

By

Published : Sep 8, 2020, 10:02 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి స్థల సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో కొవిడ్ పరీక్షలు మరింత ఎక్కువగా చేయాలని సూచించారు. ఇప్పటికే 16 కరోనా పరీక్ష కేంద్రాలు ఉండగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలన్నారు.

జిల్లా ఏరియా ఆస్పత్రిలో 60 కొవిడ్ బెడ్స్ ఉండగా అదనంగా 50 బెడ్స్ కోసం ఆస్పత్రి పైభాగంలో ఒక హాల్ కట్టినట్లు చెప్పారు. అందులో సెంట్రల్ ఆక్సిజన్​తో పాటు రెండు ఐసీయూ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆస్పత్రికి 15 రోజుల్లో సీటీ స్కాన్​ మిషన్​ వస్తుందని వెల్లడించారు.

ఇదీ చూడండి :'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకుంటే బాగుంటుంది'

ABOUT THE AUTHOR

...view details