రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మంద మకరంద్ ఇటీవల వెలువడిన ఆలిండియా సివిల్ సర్వీస్‌లో 110వ ర్యాంకు సాధించారు. మకరంద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను మర్యాదపూర్వకంగా కలిశారు.
సివిల్ సర్వీస్ ర్యాంకర్ మకరంద్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ - civil services ranker manda makarand
ఆలిండియా సివిల్ సర్వీస్‌లో 110వ ర్యాంకు సాధించిన మంద మకరంద్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. ప్రతి ఒక్కరు మకరంద్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.
![సివిల్ సర్వీస్ ర్యాంకర్ మకరంద్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ rajanna siricilla sp congratulates civil services ranker makarand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8858936-516-8858936-1600507385308.jpg)
సివిల్ సర్వీస్‌కు ఎంపికైన మకరంద్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా సివిల్ సర్వీస్‌లో సెలెక్ట్ అయినందుకు మకరంద్‌ను ఎస్పీ అభినందించారు. అనంతరం శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. జిల్లా ఖ్యాతిని తెలంగాణ మొత్తం తెలియజేసిన మకరంద్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఇష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు