మిషన్ భగీరథ పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సర్పంచ్‌లు, భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో జడ్పీ సర్వ సభ్య సమావేశంలో కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి భగీరథ పనులను అధికారులు పూర్తి చేశారని వెంకట్రామ రెడ్డి అన్నారు. కొద్దిపాటి అసంపూర్తి పనుల వల్ల పథకం క్షేత్ర స్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ పనులను యజ్ఞంలా పూర్తి చేయాలని సూచించారు. డీఈఈలు, సంబంధిత ఏఈఈలతో సమావేశమై పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఏజెన్సీ, ఇంజినీర్‌ల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.