జిల్లాలో చేపట్టిన ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో కలెక్టర్ పర్యటించి ఆకస్మికంగా ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియకు సంబంధించి ఒక్కో ఇంటివద్ద ఎంత సమయం పడుతుందని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.
ఆస్తుల నమోదు గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ - ఆస్తుల నమోదు ప్రక్రియ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో కలెక్టర్ పర్యటించి ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆస్తుల నమోదు గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
ఈ నెల 10లోగా ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రెండు మండలాల్లో జరుగుతున్న రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ