తెలంగాణ

telangana

'ఫొటోలకు ఫోజులిస్తరు..పత్తా లేకుండా పోతరు..'

By

Published : Feb 29, 2020, 2:17 PM IST

"పెద్దపెద్దోళ్లొస్తారు. ఏదో పని చేసినట్టు ఫొటోలు దిగుతరు. ఇగ మళ్ల కంటికి కన్పించరు" అంటూ ఓ వ్యక్తి కలెక్టర్​తో వాపోయాడు. వేములవాడలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్​ స్థానికుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా... వచ్చిన సమాధానమిది.

RAJANNA SIRICILLA COLLECTOR KRISHNA BHASKER SUDDEN VISIT TO VEMULAWADA
RAJANNA SIRICILLA COLLECTOR KRISHNA BHASKER SUDDEN VISIT TO VEMULAWADA

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. బద్ది పోచమ్మ ఆలయం, కూరగాయల మార్కెట్​ వీధుల్లో పర్యటించారు. పరిశుభ్రత కోసం చేపట్టాల్సిన పనులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పట్టణ ప్రగతి పనులపై స్థానికుల అభిప్రాయం తీసుకునేందుకు ప్రయత్నించిన కలెక్టర్​ కృష్ణభాస్కర్​కు సూటి సమాధానాలు లభించాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం ఫొటోలు తీసుకోవటం వరకేనని... మళ్లీ కంటికి కూడా కనిపించరని నిర్భయంగా చెప్పారు. ప్రధాన రహదారుల్లో తిరగడం కాదు... చిన్న వీధుల్లో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయని వారి అభిప్రాయాలు సూటిగా కలెక్టర్​కు తెలిపారు.

అందరి అభిప్రాయాలు ఓపికగా విన్న కలెక్టర్​... నవ్వుతూ సమాధానాలిచ్చారు. అన్ని పనులు దగ్గరుండి చేయిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.

'ఫొటోలకు ఫోజులిస్తరు..పత్తా లేకుండా పోతరు..'

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details