రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్స్ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిరిసిల్లలో 39, వేములవాడలో 28 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఆ సమయంలో కార్యాలయం బయట వివిధ పార్టీల నాయకులు, ఆశావాహులు ఉత్కంఠతో ఎదురుచూశారు.
డ్రా పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు - collecter declares muncipal reservations
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు పురపాలక సంఘాల వార్డుల వారీ రిజర్వేషన్లు డ్రా పద్దతిలో ఖరారు చేశారు. కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీశారు.
![డ్రా పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు డ్రా పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5605067-thumbnail-3x2-rajanna.jpg)
డ్రా పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు