తెలంగాణ

telangana

ETV Bharat / state

సీజనల్​ వ్యాధుల పట్ల అవగాహన పెంచాలి: జిల్లా వైద్యాధికారి - rajanna sircilla district latest news

విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

rajanna sircilla district health officer instruct to staff due to seasonal disease
సీజనల్​ వ్యాధుల పట్ల అవగాహన పెంచాలి: జిల్లా వైద్యాధికారి

By

Published : Aug 22, 2020, 2:21 PM IST

సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుమన్ మోహన్ రావు ఆదేశించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. మూవీ ట్రాఫిక్ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు.


వెంకట్రావుపల్లిలో కరోనా బారినపడిన వారితో నేరుగా మాట్లాడారు. హోమ్ ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే యాంటిజెన్​ రాపిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడేగా పరిగణిస్తూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details