పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు-నాగమణి దంపతుల హత్యను సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మహేశ్ గౌడ్ ఖండించారు. ఇది భారత రాజ్యాంగంపైన జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు.
'ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి'
పెద్దపల్లి జిల్లాలో మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై న్యాయవాదులను పట్టపగలే నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా రాష్ట్రంలో లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.
'ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి'
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో.. సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. న్యాయవాదుల హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులు పరిరక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించాలన్నారు.