మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో మార్తి 10, 11, 12న జాతర నిర్వహించనున్నారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయంలోని ఓపెన్ స్లాబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్ కలెక్టర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ షేక్ రిజ్వాన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీక్ష - rajanna sircilla district collector
మహాశివరాత్రి జాతర వేడుకలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. మార్చి 10, 11, 12 తేదీల్లో నిర్వహించే జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీక్ష
శివరాత్రి జాతరకు సంబంధించి.. భక్తుల సౌకర్యార్థం.. వాహన సదుపాయం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు.
- ఇదీ చూడండి :రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ
Last Updated : Jan 28, 2021, 2:39 PM IST