రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో, చందుర్తి మండలంలోని మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్.అరుణతో కలిసి సందర్శించారు.
ప్రారంభోత్సవానికి రైతు వేదికలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్, ఎస్పీకు తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికతోపాటు పల్లె ప్రకృతి వనాన్ని వారు పరిశీలించారు. మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికకు కలపతో చేసిన ఫినిషింగ్ అందరినీ ఆకర్షిస్తుంది. గ్రామ సర్పంచ్ అంజిబాబు స్వయంగా ముందుకు వచ్చి తన సొంత డబ్బుతో ఈ వేదికను నిర్మించారు.